telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వీటిని.. తేనెలో నానబెట్టి .. తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా.. !

dates soaked in honey is very good for health

తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉండటం వలన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచటమే కాకుండా శరీరానికి అవసరన పోషకాలను అందిస్తుంది. అలాగే ఎండు ఖర్జురాలను తినటం వలన కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండిటిని కలిపి ఎలా తీసుకోవాలంటే; ఒక జార్ లో తేనే తీసుకోని దానిలో గింజలు తీసిన ఎండు ఖర్జురాలను వేసి వారం రోజుల పాటు అలానే ఉంచాలి. వారం అయిన తర్వాత రోజుకి ఒకటి చొప్పున తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

* తేనే, ఎండు ఖర్జురాలను తినటం వలన రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. రక్తం బాగా పడటమే కాకుండా రక్త సరఫరా మెరుగు పడుతుంది. దాని తో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి హాని చేసే చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి శరీరానికి సహాయపడే మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది.

dates soaked in honey is very good for health * మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. పేగుల్లో చెడు బాక్టీరియా నాశనం అయ్యి మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దాంతో కడుపులో ఉండే క్రిములు అన్ని నశిస్తాయి.

* చదువుకొనే పిల్లలకు ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరిగి చదువులో ముందుంటారు. అలాగే పెద్దవారిలో మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది.

* ఒత్తిడి, ఆందోళ‌న వంటివి తగ్గిపోయి నిద్ర హాయిగా పడుతుంది. దీనితో నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది.

* యాంటీ బ‌యోటిక్ గుణాల కారణంగా గాయాలు,పుండ్లు త్వరగా నయం అవుతాయి.

Related posts