telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైఎస్సార్‌ రైతు భరోసా గడువు పెంపు .. డిమాండ్..

date extention demand for raitu bharosa scheme

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారీకి మరో రోజు మాత్రమే మిగిలిఉంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన రైతుల జాబితాను ఈ నెల 5న పంచాయతీల్లో ప్రదర్శించాలి. 7న రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా 8న ప్రదర్శించాల్సివుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించాల్సిన రైతుల ఖాతాలు మాత్రం లక్షలో ఉన్నాయి, దీంతో ఏం చేయాలో తెలియ స్థితిలో అధికారయంత్రాంగం చిక్కుకుంది. వాస్తవానికి ఈ నెల మూడవ తేదినే ఈ ప్రక్రియ ముగియాల్సిఉంది. అర్హులైన రైతుల జాబితా సిద్ధం కాకపోవడంతో జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో 5వ తేదికి గడువు పెంచారు. అయినప్పటికీ జాబితా సిద్ధం కాలేదు.

అధికారిక సమాచారం ప్రకారం గురువారం సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా 59,69,897 రైతుల ఖాతాలను పరిశీంచాల్సివుంది. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్‌ ఉండటంతో నిర్దేశించిన సమయంలో పరిశీలన సాధ్యం కాదని చెబుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 47,91,650 కుటుంబాలకు సంబంధించి 67,11,647 మంది రైతులున్నారు. గురువారం నాటికి గ్రామస్థాయిలో విఆర్‌ఓ, వ్యవసాయ విస్తరణాధికారులు 17,11,990 మంది రైతుల ఖాతాలను పరిశీలించి అర్హమైనవిగా తేల్చారు. 3,37,283 ఖాతాలను అనర్హమైనవిగా గుర్తించారు. అర్హమైనవిగా తేలిన ఖాతాల్లో 12,84,629 ను అప్‌లోడ్‌ చేశారు. పూర్తిస్థాయిలో రైతుల ఖాతాలను పరిశీంచి అర్హుల జాబితా తయారు చేయకపోతే లక్షలాది మంది రైతులు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి అర్హత కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలన్న డిమాండ్‌ రైతుల నుండి వినిపిస్తోంది.

Related posts