telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

భారీగా ఆస్తినష్టం తెచ్చిపెడుతున్న .. డేటా చోరీ.. భారత్ లో పెరుగుతున్న కేసులు…

data stolen issue costs huge losses to

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానిని తప్పుడు దార్లకు ఉపయోగిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తద్వారా ఆయా సంస్థలు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇందులో ప్రధానంగా డేటా చోరీ మరీ ఇబ్బందిగా మారింది. ఇటీవల చాలా సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సమాచార చోరీ. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఒక రూపంలో సమాచారం బయటకు వెళ్లిపోతోంది. అలా వెళ్లిన సమాచారం వల్ల ఒక కంపెనీ సగటున ఎంత నష్టపోతోందో తెలుసా? అక్షరాల రూ.12.8కోట్లు. ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐబీఎం ఈ విషయాన్ని వెల్లడించింది.

జులై 2018 నుంచి ఏప్రిల్‌ 2019 వరకూ సమాచార చోరీ ఘటనలను, దాని వల్ల నష్టాన్ని క్రోడీకరించి ఈ వివరాలు తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఒక కంపెనీ వచ్చే సగటు నష్టం ఏకంగా 3.29మిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు రూ.27కోట్లు. ఏడాది కాలంలో దాదాపు 500 కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి ఐబీఎం ఈ నివేదిక తయారు చేసింది. భారత్‌లో సైబర్‌ నేరాల సరళి పూర్తిగా మారిపోయిందని, సమాచార చోరీ విలువ పెరిగిపోతోందని ఐబీఎం ఇండియా సెక్యురిటీ సాఫ్ట్‌వేర్‌ లీడర్‌ వైద్యనాథన్‌ అయ్యర్‌ తెలిపారు.

Related posts