telugu navyamedia
andhra news political

దసరా మహోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు: మంత్రి కన్నబాబు

minister kannababu

విజయవాడలో ఈ నెల 29 నుంచి నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను ఏపీ మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

ఈ నెల 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. దసరా మహోత్సవాలకు సుమారు 15 నుంచి 18 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 5న కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలను సీఎం జగన్ సమర్పిస్తారని అన్నారు. గత ఉత్సవాల్లో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మరింత సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

Related posts

రాజీవ్ హత్యకేసులో జైల్లో ఉన్న నళినికి పెరోల్ మంజూరు

vimala p

కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు

vimala p

దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

vimala p