telugu navyamedia
telugu cinema news trending

చాణక్య : “డార్లింగ్…” లిరికల్ వీడియో సాంగ్

Chanakya

యంగ్ హీరో గోపించంద్ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో “చాణ‌క్య” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు, అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో గోపీచంద్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్.తాజాగా ఈ చిత్రం నుంచి “డార్లింగ్…” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts

నేడే .. కోటిమంది ఖాతాలలో.. కేంద్ర రైతు పథకం నగదు డిపాజిట్.. 2వేలు ..

vimala p

ముహూర్తం మార్చినా.. ఆర్జీవీ విడుదల చేసింది.. ఎన్టీఆర్ పాత్రని…

vimala p

ఇస్మార్ట్ శంకర్ : బోనాలు లిరికల్ వీడియో సాంగ్

vimala p