telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దర్భార్” ట్రైలర్… ఐయామ్ ఏ బ్యాడ్ కాప్…!

Darbar

మురుగ‌దాస్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబోలో వస్తోన్న సినిమా “ద‌ర్భార్”. “ద‌ర్భార్” చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమ‌కూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ తెలుగు లో విడుదల చేస్తున్నారు, జనవరి 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు..ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై అనే సంభాషణలతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ అభిమానులను ఈలలు వేయించేలా చేస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ ను దాటేసింది.

Related posts