telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్ స్టార్ సినిమాకు తప్పని లీకుల బెడద

rajinikanth as powerful police officera

“పేట” చిత్రం తరువాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం “దర్బార్‌”. లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ముంబైలో ప్రారంభమయ్యింది. మురుగదాస్‌ ఈ చిత్రంలో రజనీని చాలా అందంగా, స్టైల్‌గా చూపిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో పోలీస్‌ గెటప్‌లో వున్న రజనీ స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. దీంతో రజనీకాంత్‌ ఆ చిత్రంలో పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం నయనతార ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. ఆమె నటిస్తున్న కొన్ని సన్నివేశాలు కూడా లీక్‌ అయ్యాయి. చిత్ర షూటింగ్‌ సమయంలో కొందరు తమ మొబైల్‌ ద్వారా చిత్రీకించిన సన్నివేశాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వల్ల ఈ లీక్‌ జరుగుతోందని చిత్ర యూనిట్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం గురించి రోజుకొక విషయం బయటకి లీక్‌ కావడం వల్ల చిత్ర యూనిట్‌ ఈ వ్యవహారంపై చిత్ర యూనిట్‌ చాలా సీరియస్‌గా ఆలోచిస్తోందని తెలుస్తోంది.

Related posts