ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

మీ ఉప్పులో ఉప్పు ఉందా? ప్లాస్టిక్ ఉందా? ఒక్కసారి చూడండి…!

Plastic Molecules in Salt

పంటి సమస్యతో బాధపడుతున్న సమయంలో… మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అంటూ ఓ ప్రముఖ టూత్ పేస్ట్ కంపెనీ ప్రకటనలు చూసే ఉంటారు… అయితే ఇప్పుడు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండటం దేవుడెరుగు కానీ ప్రస్తుతం ఉప్పులో ఉప్పు ఉందా? అన్నది పెద్ద సమస్యగా మారింది… మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పలు బ్రాండ్ కెంపెనీలకు చెందిన ఉప్పును వాడుతుంటాం… అయితే ఆ ఉప్పులో అతి స్వల్ప మోతాదు ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని బొంబాయి కి చెందిన ఐఐటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు..

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం), ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వారి ప్రాజెక్ట్ లో భాగంగా ఉప్పుపై అధ్యయనం చేశారు.. కాగా ఉప్పులో ప్లాస్టిక్ అవశేషాలు ఉండటం కారణంగా ఉప్పు దాని సహజ లక్షణాన్ని కోల్పోతుందని, ముఖ్యంగా సముద్రపు ఉప్పు లోనే ఈ ప్లాస్టిక్ అవశేషాలు మోతాదు శాతంలో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది… కాగా వీరు చేసిన అధ్యయనంలో 626 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఉండగా ప్లాస్టిక్ 63% ఫ్రాగ్మెంట్స్ రూపంలో ఉంటే 37% ఫైబర్ రూపంలో ఉందని తేలింది..

అంటే ఒక కేజీ ఉప్పులో 63.76 మైక్రో గ్రాములు అంటే 0.063 మిల్లీ గ్రాముల ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది… నిత్యం 5గ్రాముల ఉప్పు తీసుకుంటాం అంటే ఏడాదికి సగటున ప్రతి భారతీయుడు 117 మైక్రోగ్రాములు 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ ని తమకు తెలియకుండానే తీసుకుంటున్నారు.. 60 సంవత్సరాల్లో ఒక్కొక్కరు 7.20 గ్రాముల అతి హానికారకమైన ప్లాస్టిక్ ని తెలియకుండానే జీర్ణించుకుంటున్నారు.. ఇకపై ఉప్పు అధికంగా తీసుకునే వారికి ఇదొక షాక్ అనే చెప్పుకోవాలి… జాగ్రత్తగా ఉంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి..

Related posts

మర్స్క్ షిప్ లో అగ్నిప్రమాదం

admin

భార్యాభర్తల సెక్స్ బహిర్గతం.. లక్షల సంపాదన.. తప్పుకాదు

nagaraj chanti

బీజేపీ ఒక్క సీటైనా గెలుస్తుందా? : బాబు

admin

Leave a Comment