సినిమా వార్తలు

చైనాలో 'దంగల్' హవా

పాత్ర పరిధిని దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా నటించే హీరోలు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రథమంగా పేర్కొనదగ్గవాడు అమీర్ ఖాన్.

అమిర్ ఖాన్ భారతీయ సినిమాకు గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రే మన కళ్ళముందు కన్పిస్తుంది తప్ప అమిర్ ఖాన్ కాదు. సినిమా అంటే గ్లామర్. ఆ గ్లామర్ ను దృష్టిలో పెట్టుకొని, అభిమానులనే ముసుగు కప్పుకొని మన హీరోలు కమర్షియల్ సినిమాలో పిచ్చి గంతులు వేస్తుంటారు. సహజత్వానికి దూరంగా హంగూ ఆర్భాటాలతో ప్రేక్షకులను మరపించి మురిపిస్తుంటారు. కానీ అమీర్ ఖాన్ గ్లామర్ అనే ఉచ్చులో ఇరుక్కోకుండా చిరస్మరణీయమైన పాత్రలెన్నింటినో పోషించిన రికార్డు ఉంది.

అమిర్ ఖాన్ నటించిన లగాన్, ఇష్క్, ఖయామత్ సే ఖయామత్, రంగ్ దే బసంతి, తలాష్, తారే జమీన్ పర్, గజినీ, దిల్, త్రి ఇడియట్స్ , ధూమ్-3 తాజాగా దంగల్. కుస్తీ పోటీల నేపథ్యములో తయారైన చిత్రమిది. దంగల్ లో అమీర్ ఖాన్ కుస్తీ పోటీలలో పాల్గొనాలని తెగ కలలు కంటాడు. అనేక కారణాల వల్ల అతని కోరిక నెరవేరదు. తన పిల్లలను కుస్తీ పోటీలలో తీర్చిదిద్దాలని అనుకుంటాడు. అక్కడ కూడా అతనికి నిరాశే ఎదురవుతుంది. అతనికి ఇద్దరూ ఆడపిల్లలే పుడతారు.

తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని అంటారు. నిరాశ, నిస్పృహ తో ఉన్న అమీర్ కు పెద్ద కూతురు షాకిస్తుంది. ఆ ఊళ్ళో ఒకడ్ని చితకబాదేసిన సంఘటనతో అమీర్ కు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. తన ఇద్దరు కూతుళ్లను కుస్తీ పోటీలలో తర్ఫీదునివ్వడం ప్రారంభిస్తాడు.

ఒక సామాన్యమైన మధ్య తరగతి కుటుంబంలోని వ్యక్తి ఎలా ఉంటాడో అమీర్ పాత్రను అలా మలిచారు. దంగల్ భారతీయ సినిమాను ఓ కుదుపు కుదిపేసింది. 64వ జాతీయ అవార్డులలో రాజకీయ కారణాల వల్ల దంగల్ ను పట్టించుకోకపోయినా అంతర్జాతీయంగా దంగల్ కు వచ్చిన పేరు, ప్రతిష్టలు అమోఘం, అద్వితీయం, అనన్య సామాన్యం.

మిగతా దేశాలలో దంగల్ కలెక్షన్ల గురించి పక్కన పెడితే మన పొరుగున ఉన్న చైనాలో దంగల్ అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అది ఎంతగా అంటే ఆ దేశంలో దంగల్ పన్నెండు వందల కోట్ల రూపాయలను వసూలు చేసి, మునుపెన్నడూ లేని రికార్డులను సృష్టించింది. గత సంవత్సరం చైనాలో విడుదలైన అన్నీ ప్రపంచ దేశాల సినిమాలతో పోలిస్తే దంగల్ ప్రథమ స్థానంలో ఉంది.

అమీర్ ఖాన్ ఓ అరుదైన సహజ నటుడు. సినిమా గ్లామర్ తో పాటు గ్రామర్ ను కూడా సొంతం చేసుకున్న అసమాన్య హీరో.

Related posts

ఫసక్ అంటే…నిధి…

chandra sekkhar

కృష్ణా… ముకుందా… మురారీ… “ఎన్టీఆర్” కృష్ణాష్టమి శుభాకాంక్షలు

vimala t

భాష నా శ్వాస(గేయం)

chandra sekkhar

Leave a Comment