telugu navyamedia
telugu cinema news trending

“దండుపాళ్యం-4” ట్రైలర్… హింస, శృంగారం ఎక్కువయ్యాయా ?

Dandupalyam-4

వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ నిర్మించిన “దండుపాళ్యం” ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌చ్చిన చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. తాజాగా సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా “దండుపాళ్యం-4” చిత్రం తెర‌కెక్కుతుంది. కె.టి.నాయక్‌ దర్శకత్వంలో రూపొందిన “దండుపాళ్యం-4” నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో హింస‌, శృంగారం త‌దిత‌ర అంశాలు ఎక్కుగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. వెంకట్ మూవీ బ్యానర్ పై నిర్మాత వెంకట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం భువన చంద్ర అందించారు. దండుపాళ్యం ఫ్రాంచైజ్‌లో వ‌స్తున్న “దండుపాళ్యం-4” చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుందని అనుకుంటున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts

ఈ స్టార్ హీరోయిన్ కు ఎవరూ ప్రపోజ్ చేయలేదట…!?

ashok

తెలంగాణ స్పీకర్ … కు ఆ హక్కు లేదు.. : ఉత్తమ్ ఆరోపణ..

vimala p

ఆ రెండు సినిమాలు వదులుకోవడం వల్లే ఇలా… : ఇలియానా

vimala p