• Home
  • వార్తలు
  • బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ కీలక నేత రాజనర్సింహ భార్య!
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ కీలక నేత రాజనర్సింహ భార్య!

Raja narasimha, Padmini BJP to Congress

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊహించని విధంగా షాక్‌ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ రావు, రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌లు గురువారం ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువాతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి లేదా మెదక్ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే తాను బీజేపీలో చేరినట్టు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతావని ప్రగతి బాటన నడుస్తోందని అన్నారు.

పద్మినీరెడ్డి భర్త దమోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య ఇలా బీజేపీలో చేరడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం​ ఏంటని చర్చించుకుంటున్నారు. తన సతీమణి ప్రత్యర్థి పార్టీలో చేరడంతో మున్ముందు దామోదరకు ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే  రాజనర్సింహ సతీమణిని లక్ష్మణ్ స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Related posts

మార్కెట్ లో బంగారం ధరలు…

chandra sekkhar

హలో గురు ప్రేమకోసమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..’చిత్రాలు’…

chandra sekkhar

కర్ణాటక మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్…

admin

Leave a Comment