రాజకీయ వార్తలు వార్తలు

గుజరాత్ లో 300 మంది దళితులు బౌద్ధంలోకి

గుజరాత్ లోని కొంత మంది దళితులు ఎల్లుండి బుద్ధ పౌర్ణమి సందర్బంగా బుద్ధిజంను స్వీకరించబోతున్నారు. పోరుబందర్ నుంచి బౌద్ధ మతగురువులు, స్థానిక రాజకీయ నాయకులు కార్యక్రమానికి హాజరౌతున్నారు. వారి ఆధ్వర్యంలో వీరంతా బుద్ధిజం స్వీకరించబోతున్నారు.

గుజరాత్‌లోని ఉనా తాలుకా మోటా సందియా గ్రామానికి చెందిన దాదాపు 300 మంది దళితులు బౌద్ధమతం స్వీకరించనున్నాయి. దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో దళిత సామాజిక వర్గంపై జరుగుతున్నా దాడులు, చూపే వివక్షకు వ్యతిరేకంగా బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని మేమంతా బుద్దిజమ్‌ను చేపడుతున్నామని వారు తెలిపారు.

గుజరాత్ లో గతంలో దాడికి గురై బౌద్ధం స్వీకరించబోతున్న దళిత వ్యక్తి రమేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం ప్రజలందరూ చూస్తుండగానే మాపై దాడి చేశారు. అప్పటి సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదు. మమ్మల్ని తమవాళ్లుగా ఒప్పుకోలేని మతంలో ఉండి ఏం లాభం? అందుకే వివక్షే లేని బౌద్ధమతంలోకి సహచరులతో కలిసి తాను వెళ్తున్నట్లు పేర్కొన్నాడు.

Related posts

కీర్తి సురేష్ ‘చిత్రాలు’…

chandra sekkhar

అబ్బాయిలు ఇక 18 ఏళ్లకే పెళ్ళాడొచ్చట…

jithu j

హర్షితా పన్వార్.. ‘చిత్రాలు’..

chandra sekkhar

Leave a Comment