telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

దళిత యువకుడి లేఖపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

Ramnath president

పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి సీరియస్ అయ్యారు. విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ బదిలీ అయింది. అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. పూర్తి వివరాలు, కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగులు జనార్దన్ బాబుకు అందించాలని తెలిపింది.

తనకు శిరోముండనం చేసిన తర్వాత దీనికి కారణమైన వ్యక్తులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రపతికి ప్రసాద్ లేఖ రాశారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని వాపోయారు. రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నానని తెలిపారు. మావోయిస్టుల్లో చేరి తనకు తానే న్యాయం చేసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖపై 24 గంటల్లో రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

Related posts