telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

పప్పుతో కూడా కొవ్వు కరుగుతుందా..?!

ప‌ప్పు .. ఇది పసిపిల్లల నుండి అందరికి ఆహారంగా ఇస్తుంటారు. దీనిని బట్టే అది ఎంత తేలిక ఆహారంలో అర్ధం చేసుకోవచ్చు. ఇక కాస్త పెద్దైన పిల్లలు పప్పు అంటే ససేమీరా అంటారు. పెద్దలు కాస్త పరవాలేదు అన్నట్టుగా అవకాయతో కలిపి లాగించేస్తుంటారు. కానీ ఇప్పటి పరిస్థితులలో జంక్ ఫుడ్ తినే అలవాటు పడినవారికి పప్పు రుచే తెలియదు. అదంటే నావల్లకాదు మేము తినం అంటుంటారు. కానీ అది ఆరోగ్యానికి చాలా మెలనేది కొందరికే తెలుసు.

నిజానికి పప్పులో ఉండే గుణాలు శరీరంలో ఉండే కొవ్వు ను కరిగించేస్తాయట. అంటే వేలకు వేలు రకరకాల వెయిట్ లాస్ సంస్థలకు పోసేకంటే పప్పు తగిన పరిమాణంలో తీసుకోవడం చాలా మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది అంటున్నారు నిపుణులు.

dal should take to avoid heart attacksఈ ప్రయోజనం ఉందని తెలిసిన వారు ఇంకా పప్పును పక్కన పెట్టారు. అంటే, నిత్యం ప‌ప్పు దినుసుల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో ఉండే కొవ్వును క‌రిగించుకోవ‌చ్చ‌ని.. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. ప‌ప్పు దినుసుల వ‌ల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు క‌రుగుతుంద‌ట‌. దీనితో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. క‌నుక ప‌ప్పు దినుసుల‌ను ఖచ్చితంగా రోజూ తినాల్సిందేన‌ని వైద్యులు కూడా చెబుతున్నారు..!

Related posts