telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైసీ ఎడ్గార్ జోన్స్…బ్రిటన్ టీవీ నటి ..

daisy jones is british actress

రాజమౌళి నోటి నుంచి, భారత ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అయిన జోన్స్ పేరు రాగానే, ప్రెస్ మీట్లో విస్మయం వ్యక్తమైంది. ఎంతో గొప్ప నటి అయ్యుంటే తప్ప జక్కన్న ప్రత్యేకంగా ఆమెను తీసుకురాడు అని అందరూ ఫిక్సయిపోయారు. ఇక, ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇంతకీ డైసీ ఎవరంటూ సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది.

జోన్స్ బ్రిటీష్ నటి. ఆమె ఇంతకుముందు కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో నటించించింది. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాండ్ లైఫ్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. డైసీ ఓ డ్రామా నటి. బ్రిటన్ లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఈ యువనటి ద మౌంట్ స్కూల్ ఫర్ గాళ్స్ లో విద్యాభ్యాసం చేసింది.

ఆ తర్వాత వుడ్ హౌస్ థియేటర్ స్టడీస్ సెంటర్ (వుడ్ హౌస్ డ్రామా కాలేజ్) లో చేరి నటనకు సంబంధించిన కోర్సులు అభ్యసించింది. మరీ అంత గొప్ప పేరు లేకపోయినా రాజమౌళి దృష్టిలో పడడం అంటే డైసీ అదృష్టం అని చెప్పాలి. కొంచెం ఇలియానా పోలికలతో ఉండే డైసీని తెలుగు ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునే అవకాశాలున్నాయి.

Related posts