telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు

17-10-2020 నాటి రాశిఫలాలు

మేషం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
– దేవాలయం లో బీన్స్ కాయగూరలు సమర్పణ చేయండి.

వృషభం: కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
– దేవాలయం లో అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పణ చేయండి.

మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
– దేవాలయం లో మోతీచూర్ లడ్డూలు సమర్పణ చేయండి.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దైవదర్శనాలు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. ఉద్యోగాలలో సమస్యలు.
– పేదవారికి యాపిల్ జ్యూస్ ను పంచండి.

సింహం: పనులలో ఆటంకాలు. స్వల్ప అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. దైవదర్శనాలు.
– దేవాలయం లో ద్రాక్ష పళ్ళను సమర్పించండి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు.
– దేవాలయంలో / ఇంట్లో అమ్మవారికి పాయసం నివేదించండి.

తుల: కొత్త రుణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలు ముందకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త అనుకూలత.
– దేవాలయం లో నెయ్యిని దానం చేయండి.

వృశ్చికం: శుభకార్యాలపై చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి ఒప్పందాలు. కుటుంబంలో సమస్యలు తీరే సమయం. ఆప్తులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
– పేదవారికి చెప్పులు దానం చేయండి.

ధనుస్సు: కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
– దేవాలయం లో మిశ్త్రి సమర్పణ చేయండి.

మకరం: విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
– అమ్మవారికి ఏర్పు రంగు పుష్పాలు సమర్పణ చేయండి.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
– చెట్లకు నీరు పోయండి

మీనం: సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
– దేవాలయం లో పంచదార ఇవ్వండి.

Related posts