telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చిత్రసినిమాలోకి మరో దగ్గుబాటి వారసుడు…?

సినిమా పరిశ్రమలోకి ఇప్పుడు అందరు వరాలను పంపిస్తున్నారు. చిన్న చిన్న పాత్రలు చెస్ వారి వద్ద నుండి పెద్ద పెద్ద హీరోలు కూడా తమ కొడుకులను హీరోలు చేస్తున్నాడు. అయితే సినీ పరిశ్రమలోనే టాప్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యే రోజు ఇక ఎంతో దూరంలో లేదు అని తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలుగా అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అభిరామ్‌ దగ్గుబాటితో తనదైన శైలిలో సినిమా తీసేందుకు నట, దర్శకుడు రవిబాబు ఓ కథను తయారు చేశాడట. సురేశ్ బాబు సైతం దానికి ఓకే చేశాడని తెలుస్తోంది. దర్శక నిర్మాత ఇవీవీ సత్యనారాయణ తనయుడు నరేశ్‌ ను ‘అల్లరి’ సినిమాతో పరిచయం చేసింది కూడా రవిబాబే కావడం విశేషం. పైగా సురేశ్‌ బాబు, రవిబాబుకు మధ్య కూడా చక్కని అనుబంధం ఉంది. రవిబాబు తెరకెక్కించిన పలు చిత్రాలకు సురేశ్ బాబు సమర్పకుడిగా ఉన్నారు. అంతేకాదు… రవిబాబు ప్రతి సినిమాకు ఆయన తనవంతు సలహాలూ సూచనలు ఇస్తుంటారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts