telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఇంటిముందు గొడవ చెయ్యొద్దంటే … ఏకంగా మర్మాంగంపై పొడిచారు

Knife

స్థానికంగా అల్లర్లు చేస్తున్న కొంతమంది కుర్రాళ్లు బుధవారం సాయంత్రం లివర్‌పూల్ వీధుల్లో వీరవిహారం చేస్తున్నారు. ఓ ఇంటి ముందు గుమిగూడి, విపరీతంగా గొడవ చేస్తుండటంతో 40 ఏళ్ల ఆ ఇంటి యజమానికి చిరాకొచ్చి, వారిని తన ఇంటి ముందు నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించాడు. అంతే అతను చేసిన పనితో పెట్రేగిపోయిన ఆ అల్లరి మూక అతనిపై దాడికి పాల్పడింది. జేబుల్లో నుంచి కత్తులు తీసి అతనిపై దాడికి తెగబడింది. ముఖ్యంగా అతని వృషణాలు, మర్మాంగం ప్రాంతంలో కత్తులతో దాడి చేసిన ఆ మూక, రక్తపు మడుగులో పడిన అతన్ని అలాగే వదిలేసి పారిపోయింది. ఈ గొడవను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటిముందు మడుగుకట్టిన రక్తం చూసి ఆందోళనతో అట్నుంచి అటే ఆస్పత్రికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts