telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాయుగుండంగా అల్పపీడనం.. మత్యకారులకు హెచ్చరికలు..

fani cyclone effect on badrachalam

ఈశాన్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడి తీత్ర అల్పపీడనంగా మారింది. నేడు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలో గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కోస్తాంధ్ర తీరం వెంబడి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related posts