telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

అల్పపీడనం సిద్ధం.. రెండురోజులలో వాయుగుండంగా.. అతి భారీ వర్షాలు..

cyclone in 2 days starts huge rains in telugu states

నేడు మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనుందని, మంగళవారం నాటికి ఇది వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చని ఆయన అంచనా వేశారు.

నైరుతి రుతుపవనాలు వచ్చిన తరువాత ఇదే తొలి అల్పపీడనం కావడంతో, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ ఖరీఫ్ లో ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతాంగం, ఈ సీజన్ ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

Related posts