telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సైక్లింగ్ తో .. బ్రెస్ట్ క్యాన్సర్‌ కు .. దూరంగా ఉండొచ్చు.. తెలుసా..

cycling is best for breast cancer

ఇటీవల బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు బాధ పడుతున్న విషయం తెల్సిందే. వారు వారానికి 150 నిమిషాలపాటు సైకిల్‌ తొక్కడం లేదా వడి వడిగా నడవడం చేస్తే ఖచ్చితంగా 30 శాతం మందికి క్యాన్సర్‌ తగ్గిపోతుందని పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో తేలించి అలాగే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రానివారు కూడా ఈ వ్యాయామాలు చేస్తే వారిలో కూడా 30 శాతం మందికి ఈ జబ్బు రాదని వారు తెలిపారు.

గత పదేళ్ళుగా హైడెల్‌బెర్గ్‌లోని ‘జర్మనీ క్యాన్సర్‌ రీసర్చ్‌ సెంటర్‌’కు చెందిన పరిశోధకులు 2000 మందిపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు వ్యాయామానికి ఏమైన సంబంధం ఉందా ? అన్న అంశంపై తొలిసారిగా ఈ అధ్యయనం జరిపినట్లు పరిశోధకులు తెలిపారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చిన మహిళల్లో వ్యాయామం చేస్తున్న వారు చనిపోవడం చాలా అరుదుగా జరుగుతుండడంతో ఈ దిశగా అధ్యయనం జరపాలనే ఆలోచన వచ్చినట్లు వారు తెలిపారు.

Related posts