telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … ఒక్కొక్కటిగా బయటపడుతున్న .. సైబర్‌ లేడీ అరాచకాలు …

New couples attack SR Nagar

సైబర్‌ లేడీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్కూల్స్‌, డెంటర్‌ క్లినిక్స్‌, బ్రాండెడ్‌ సెలూన్‌లను సైబర్‌ లేడీ నేహా ఫాతిమా టార్గెట్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 255 స్కూల్స్‌ నుంచి పిల్లల ఫోటోలు సేకరించిన నేహా ఫాతిమా… ఆ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడేది ఫాతిమా. మార్పింగ్‌ చేసిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుంది. ఆ ఫోటోలను తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేది ఫాతిమా. ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఫిర్యాదుతో మాయలేడీ బాగోతం బయటపడింది.

ఫాతిమా కేసును సైబర్‌ క్రైమ్‌ పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. నేహా ఫాతిమాను మూడు రోజుల కస్టడీకీ కోరనున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. ఈ తరహా మోసం తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. ఫాతిమా చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు జరిగిన మోసం గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇన్నాళ్లు భయపడి సైలెంట్ గా ఉండిపోయిన బాధితులు.. నేహా అరెస్ట్ తో ధైర్యంగా ముందుకొస్తుండటం విశేషం.

Related posts