telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

క్యూబా కొత్త అధ్యక్షుడిగా .. మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ ఏకగ్రీవం ..

cuba president elected as Unanimous

క్యూబా దేశ జాతీయ అసెంబ్లీ మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ను కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దాదాపు 43 ఏళ్ల విరామం తరువాత గత ఏప్రిల్‌లో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన జాతీయ అసెంబ్లీ జులైలో కొత్త ఎన్నికల చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమలులోకి వచ్చిన మూడు నెలల్లోగా దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి వుంటుంది. గురువారం జరిగిన ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలోని మొత్తం 580 మంది ప్రతినిధుల్లో 579 మంది కానెల్‌ను సమర్ధిస్తూ ఓటు వేశారు.

ఇప్పటి నుండి ఆయన 2023 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన దేశ పాలనా, మంత్రిమండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సాల్వడార్‌ వాల్డెస్‌ మెసా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎస్టెబన్‌ లాజో జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఎన్నికైన కానెల్‌ డిసెంబర్‌లో ప్రధానిని నియమించనున్నారు. మాజీ అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో హయాంలో 1956 నుండి 1976 వరకూ కొనసాగిన ప్రధాని పదవిని ఇప్పుడు పునరుద్ధరించటం గమనార్హం.

Related posts