• Home
  • వార్తలు
  • రైల్లోంచి 1040 ఫుడ్ ప్యాకెట్స్ ని పడేసిన 2వేల మంది జవాన్లు…! స్పందించిన రైల్వే శాఖ
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు

రైల్లోంచి 1040 ఫుడ్ ప్యాకెట్స్ ని పడేసిన 2వేల మంది జవాన్లు…! స్పందించిన రైల్వే శాఖ

CRPF Police Through 1040 Food Packets to Railway Track

సీఆర్పీఎఫ్ కు చెందిన 2 వేల మంది జవాన్లు… జార్ఖండ్ నుంచి ఛత్తీస్ గడ్ కు ఎన్నికల విధుల నిర్వహణ నిమిత్తం వెళుతున్నారు… కాగా మొత్తం 2 వేల మంది జవాన్లు ఒకే రైలులో వెళుతుండగా.. తమకు భోజనం అందించాలని ముందుగానే రాయగఢ్ రైల్వే స్టేషన్ కు సమాచారం అందజేశారు… కాగా రాయగఢ్ స్టేషన్ లో ఆర్డర్ ఇచ్చిన విధంగానే వారికి ఆహారం ప్యాకెట్లు అందజేశారు.. ఆకలితో ఉన్న వారంతా అన్నం తిందామని వారికిచ్చిన ఆహారం ప్యాకెట్ లను తెరిచి చూడగా ఆ ఆహారమంతా కంపు వాసనతో కుళ్లిపోయిన విధంగా కనిపించేసరికి వాటిని రైల్వే ట్రాక్ పై పడేశారు..

కేవలం మంచి నీటితోనే కడుపు నింపుకున్నారు… ఎందుకంటే తిరిగి ఆహారం అందించాలని కోరినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు… దీనితో ప్రయాణం మొత్తం చాయ్ నీళ్లు, మంచినీళ్లే వారికీ ఆహారం అయ్యాయి. కడుపులో ఆకలితో లమటిస్తు ప్రయాణించాల్సి వచ్చింది.. ఈ విషయంపై స్పందించిన రైల్వే శాఖ.. రావాల్సిన సమయం కన్నా నాలుగు గంటల ఆలస్యంగా రైలు వచ్చిందని.. ఇందువల్లనే పప్పు పాడైపోయి వాసన వచ్చిందని వివరణ ఇచ్చింది… రైల్వే శాఖ ఇచ్చిన వివరణ చూసుకుంటే…

ఆహారం విషయంలో వారు చేపట్టే చర్యలు యిట్టె అర్థమైపోతుంది.. మాములుగా చూసుకుంటే సుమారు 12గంటల పాటు ఆహారం పాడవకుండా ఉంటుంది.. అలాంటిది 4గంటల ఆలస్యం.. ఆహారం పాడవడం… పాపం జవాన్లు…







 

Related posts

నోట్లో పేగులు, మొఖంపై పసుపు, కుంకుమ… పక్కా ప్లానింగ్ హత్య.. వణుకు పుట్టిస్తుంది

jithu j

రాహుల్ సమంతతో ఏం చెబుతున్నాడో తెలుసా…!?

vimala t

వరవరరావుకు…ఐదు వరకు గృహనిర్బంధం…హైదరాబాద్ లోనే

chandra sekkhar

Leave a Comment