telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోడల్ పై సాకర్ సూపర్ స్టార్ రేప్… 2.75 కోట్లతో సెటిల్మెంట్

cristiano

సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విషయంలో రొనాల్డో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అమెరికాకు చెందిన మయోర్గా అనే మోడల్ రొనాల్డోపై అత్యాచార ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు పదేళ్ల క్రితం రొనాల్డో తనపై అత్యాచారం చేశాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ పిటిషన్ పై విచారణ సాగుతోంది. అయితే మయోర్గాకు అప్పట్లోనే రొనాల్డో భారీగా డబ్బులు ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడనే వార్తలు విన్పించాయి. అయితే రొనాల్డో మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ వచ్చాడు. అయితే తాజాగా రొనాల్డో లాయర్లు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2.75 కోట్లను రొనాల్డో సదరు మోడల్ కి చెల్లించి ఆమెతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడని, అయితే అది నేరాన్ని ఒప్పుకోవడం కాదని, మోడల్ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేనప్పటికీ బహిరంగ ఆరోపణలు చేయకుండా రొనాల్డో ఆమెకి డబ్బు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని లాయర్లు అంటున్నారు. అంత భారీ మొత్తాన్ని తీసుకొని కూడా ఆమె ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని లాయర్లు కోర్టుకి తెలిపారు.

Related posts