telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏక్తాకపూర్ పై క్రిమినల్ కేస్ పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్

Ektha

ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ పథక్ కేసు నమోదు చేసాడు.ఏక్తా కపూర్ నిర్మించిన ‘అన్ సెన్సార్డ్ సీసన్ -2’ వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాల కారణంగా ఏక్తాకపూర్ పై క్రిమినల్ కేస్ పెట్టాడు వికాస్ పథక్. అయితే ‘అన్ సెన్సార్డ్ సీసన్ -2’లోని ‘ప్యార్ ఔర్ ప్లాస్టిక్’ అనే ఎపిసోడ్ లో ఒక వ్యక్తికి ఆర్మీ దుస్తులు వేసి అతనితో అభ్యంతరకరమైన సంభాషణలు పలికించారని ఈ కేస్ పెట్టినట్లు సమాచారం. ఈ కేసు పై కోర్టు ఆగష్టు 24న విచారణ జరపనున్నారట. ఆర్మీ దుస్తులలో వ్యక్తి సంభాషణ అభ్యంతరకరంగా ఉండటమే గాక ఆర్మీ దుస్తులను చిహ్నాన్ని అగౌరవంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ పథక్ ఈ కేసు వేశారని తెలుస్తోంది.

Related posts