telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రవిప్రకాశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

Ravi Prakash

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఈ మెయిల్స్‌ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవిప్రకాశ్‌, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఫిబ్రవరి 20న శివాజీ కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాప్ట్‌ వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 13వ తేదీన తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాప్ట్‌ను అదేరోజు సాయంత్రం 5.46 గంటలకు ఫైనాన్స్‌ అధికారి మూర్తికి మెయిల్‌ చేసిన శక్తి, రవిప్రకాశ్‌, ఎం.వి.కె.ఎన్‌.మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరికి కాపీలు పంపినట్లు సమాచారం.

ఈ అంశంపై రవిప్రకాశ్, మూర్తి, హరిలతో, ఏబీసీఎల్‌ ఫైనాన్స్ అధికారి మూర్తి (మరో మూర్తి) మధ్య జరిగిన ఈ-మెయిల్‌ సంభాషణలను సైబర్ క్రైమ్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో వాస్తవం బయటపడింది.ఈ-మెయిల్స్ ఆధారాలు దొరక్కుండా రవిప్రకాశ్, ఆయన అనుచరులు సర్వర్‌లో డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీసినట్లు సమాచారం.

Related posts