• Home
  • Trending Today
  • ప్రియురాలితో పెళ్లి ఫిక్స్ చేసుకున్న యువక్రికెటర్
Trending Today క్రీడలు వార్తలు సామాజిక

ప్రియురాలితో పెళ్లి ఫిక్స్ చేసుకున్న యువక్రికెటర్

Cricketer Sanju Samson Marriage

టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలో తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సంజూనే ప్రకటించాడు. 23 ఏళ్ల సంజూ తన కళాశాల క్లాస్‌మేట్‌ అయిన చారును ఐదేళ్లక్రితం కలిశాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయం ఎప్పుడూ బహిర్గతం కానివ్వలేదు. అయితే, తమ ప్రేమకు ఇప్పుడు పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిన విషయాన్ని సంజూ వెల్లడించాడు. గత కొన్నేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ చారును డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నట్టు ఈ యువ క్రికెటర్‌ ప్రకటించాడు.

“2013, ఆగస్టు 22వ తేదీన చారుకు తొలిసారి చూశాను. ఆ తర్వాత నుంచి మా బంధం క్రమేపీ బలపడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు మా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. మేము ఇద్దరం ఎన్నోసార్లు కలిసి గడిపాము. కానీ ఎప్పుడూ బహిరంగంగా మాత్రం కలిసి తిరగలేదు. ఈరోజు మా పెళ్లికి పెద్దల వైపు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మా పెళ్లిని సంతోషంగా ఒప్పుకున్నారు మా ఇద్దరి తల్లిదండ్రులు. వారికి చాలా చాలా థాంక్స్. మా పెళ్లికి డిసెంబర్‌ 22వ తేదీన ముహూర్తం కుదిరింది‌’ అని సంజూ శాంసన్‌ తెలిపాడు. చారు తండ్రి తిరువనంతపురంలో సీనియర్‌ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ‘’ అని శాంసన్‌ పేర్కొన్నాడు.

Related posts

నేనెదనుకున్నా ఆ ముగ్గురే నాకు ఫస్ట్… కరణ్ జోహార్

nagaraj chanti

జనసేన నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

jithu j

ఇక నుండి సైకిల్ పై వెళ్లేవారు కూడా హెల్మెట్…లేదంటే జరిమానా..!!

chandra sekkhar

Leave a Comment