• Home
  • Trending Today
  • ఆ అమ్మాయిని బెడ్ పైకి తోసేసి… స్టార్ క్రికెటర్ మలింగా బాగోతం
Trending Today సినిమా వార్తలు

ఆ అమ్మాయిని బెడ్ పైకి తోసేసి… స్టార్ క్రికెటర్ మలింగా బాగోతం

malinga

మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల వల్ల జరిగే లైంగిక వేధింపులు బయటపడ్డాయి. తాజాగా క్రీడారంగానికి కూడా ఆ సెగ పాకింది. గుత్తాజ్వాల కూడా తనను మెంటల్ గా వేధించారని తెలపగా… స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా మద్దతు తెలిపారు. నిన్ననే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఎయిర్ హోస్టెస్ సంచలన ఆరోపణలు చేసింది.

ఇక తాజాగా అదే దేశానికి చెందిన మరో స్టార్ క్రికెటర్ లసిత్ మలింగాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ… బయటకు రాలేని మహిళల గొంతుకగా నిలిచి, వారి బాధను ప్రపంచానికి వివరిస్తున్న టాలీవుడ్ సింగర్ చిన్మయి… మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. బాధితురాలు తన గోడును చిన్మయికి షేర్ చేయగా ఆమె ట్వీటర్ వేదికగా ప్రపంచానికి తెలియజేసింది.

“కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్ సీజన్ కావడంతో శ్రీలంక ఫేమస్ క్రికెటర్ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఆమె మలింగా రూంలో ఉందని తెలిసింది. దీంతో నేను ఆ గదిలోకి వెళ్ళాను. కానీ అక్కడ ఆమె కన్పించలేదు. మలింగా మాత్రం నన్ను బెడ్ పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక నన్ను నేను రక్షంచుకోలేనని గ్రహించి ఏం చేయలేక కళ్లు మూసుకుని ఉండిపోయాను. అదే సమయంలో హోటల్ సిబ్బంది డోర్ కొట్టడంతో అక్కడినుంచి తప్పించుకున్నాను. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెప్పగా అతనో ఫేమస్ క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని… నీవే అతని రూంకు వెళ్లావని… తప్పంతా తనదే అన్నట్టుగా మాట్లాడారని తెలిపింది సదరు యువతి. మరి ఈ విషయంపై మలింగా ఏమంటాడో చూడాలి.

Related posts

నా పేరు సూర్య రికార్డు..

admin

పాత్ర కోసం 15కిలోలు తగ్గాను : రానా!

admin

ఒక్కటే వాట్స్ ఆప్ మెసేజ్…ఆ సంస్థ 9,200 కోట్లు స్వాహా…

chandra sekkhar

Leave a Comment