telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ పూర్తి..

ద‌ర్శ‌కుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్​ని ఇస్తూ వస్తున్న మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్​ని అందించారు.

Ram Charan Introduces His RRR Movie Character Alluri Sita Ramaraju with Powerful Poster

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్​గానే కాకుండా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ పూర్తయింది. ఈ మేరకు చిత్రబృందం గురువారం ప్రకటించింది. కొన్ని చిన్న చిన్న షాట్స్​ మాత్రమే మిగిలి ఉన్నాయని.. పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించింది.

RRR Movie: Get Ready For An Awesome Surprise Tomorrow

అంతే కాకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్​ను ఇస్తామని పేర్కొంది. 2018 నవంబర్ 19న ఏ బైక్​ షాట్​తో అయితే చిత్రీకరణ ప్రారంభం అయిందో.. అదే బైక్​ షాట్​తో షూటింగ్​ పూర్తైంది అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా అప్‏డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా ఆర్ఆర్ఆర్ టీం తెలిపింది.

RRR Movie (Oct 2021) - Trailer, Star Cast, Release Date | Paytm.com

ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… శ్రియా శరణ్, అజయ్ దేవ్‏గన్‏లు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ ‘ఆర్​ఆర్​ఆర్​ ఈ మూవీ అక్టోబర్‌ 13న విడుదలకు సిద్దమైందని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో విడుదల తేదీ వాయిదా పడినట్లు వార్తలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది ఉగాదికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Image

దీంతో అక్టోబర్‌లోనే సినిమాను చూడోచ్చని సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే ​ చిత్రం కొత్త రిలీజ్​ డేట్ పై రానున్న రోజుల్లో మరో ప్రకటన రానుంది అనే టాక్ వినిపిస్తుంది.

RRR: Ajay Devgn is bloodied but unbent in explosive clip, Watch | Entertainment News,The Indian Express

Related posts