telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

క్యాంపస్ లో కూలిన క్రేన్… నలుగురి మృతి!

google doodle on voting in India

అమెరికాలోని సియాటెల్ నగరంలోని గూగుల్ ప్రధాన క్యాంపస్ లో నిర్మాణ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న భారీ క్రేన్ విరిగి పడటంతో నలుగురు మరణించగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. కొత్త క్యాంపస్ ను నిర్మించేందుకు భవంతి పైన అమర్చిన క్రేన్ విరిగి, కింద ఉన్న కార్లపై పడింది. దీంతో ఆరు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, నలుగురు మరణించారని సియాటెల్ ఫైర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది.

మృతి చెందిన వారిలో ఓ మహిళ ఉందని తెలిపారు. మృతుల్లో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లుకాగా, మిగతావారు కార్లలో ఉన్న వారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో నాలుగు నెలల చిన్నారి ఉందని, వీరందరినీ ఆసుపత్రులకు తరలించామని తెలిపింది. క్రేన్ విరిగి పడటంపై వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఇండస్ట్రీస్ విభాగం విచారణ జరుపుతోందని పేర్కొంది.

Related posts