• Home
  • Trending Today
  • చెన్నైలో భారీ అగ్నిప్రమాదం…లోడ్ చేస్తుండగా బాణాసంచా పేలుడు…
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సామాజిక

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం…లోడ్ చేస్తుండగా బాణాసంచా పేలుడు…

crackers fired while loading in chennai 3 died

దీపావళి సందర్భంగా బాణాసంచా రవాణా జరగటం సహజం. కానీ అది చేర్చే వారి కష్టాలు ఇంతా అంతా కావు, చాలా జాగర్తగా ఉండాలి, లేదంటే జీవితాలు తలక్రిందులు అయిపోతాయి. దీపావళి అంటే బాణాసంచా అనే సాంప్రదాయం ఎందుకు వచ్చిందో కానీ ఆ పేరుమీద ప్రతి ఏడాది ఎందరో ప్రమాద వశాత్తు బాణాసంచా పేలి మృత్యువాత పడుతున్నారు. అయినా వారి శవాలమీద పండగ చేసుకున్నట్టు భారీగా బాణాసంచా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి.

దీపావళి దగ్గర పడటంతో చెన్నైలో రవాణా కోసం బాణాసంచా ను లారీ లో లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగిపోయింది. లోడింగ్ సమయంలో మంటలు రాజుకోవటంతో సరుకు అంతా క్షణాలలో మంటలు వ్యాపించి పేలుడు భారీగా జరిగింది. దీనితో లోడ్ చేస్తున్న కూలీలు ముగ్గురు అక్కడికక్కడే మృతించేందగా, ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. ఒక అపార్టుమెంట్ కూడా దెబ్బతినింది.. ఇక అక్కడ ఉన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఘటన స్థలికి దగ్గరగా ఉన్న వాహనాలు తుక్కుతుక్కుగా మారిపోయాయి.

ఘటనకు గురించి తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నివాస సముదాయాల మధ్య బాణాసంచా తయారు చేస్తున్నారని వివరాలలో వెల్లడించారు అధికారులు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Related posts

అపార్ట్‌మెంట్‌లో భారీ పేలుడు.. ఇద్దరికి తీవ్రగాయాలు

madhu

విదేశీ యువతిపై చర్చ్ లోనే అత్యాచారం.. అడ్డుకోబోయిన పోలీస్ అధికారి ని

nagaraj chanti

“దేవదాస్” నాలుగు రోజుల వసూళ్లు ఇవే…

vimala t

Leave a Comment