telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సీపీఎస్ సర్వే : వైసీపీ కే .. ప్రజల పట్టం..

AP Assembly contest candidates

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని సీపీఎస్ (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) సర్వే స్పష్టం చేసింది. ఎన్నికల విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాలరావు నేతృత్వంలోని టీమ్ ఈ సర్వేను ప్రకటించింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో 21, ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని పేర్కొంది. టీడీపీకి 45 నుంచి 54 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు వస్తాయని, జనసేన 1 నుంచి 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.

ఓట్ల శాతం పరంగా చూస్తే, వైసీపీకి 48.1 శాతం, టీడీపీకి 40.1 శాతం, జనసేనకు 8 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపబోవని సీపీఎస్ అంచనా వేసింది. జనసేన పార్టీ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాపై మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్పింది. రెండు దశల్లో సర్వేను నిర్వహించామని, ఫిబ్రవరి 17 నుంచి 21 వరకూ తొలి దశలో 4.37 లక్షల మందిని, మార్చిలో 27 నుంచి 31 మధ్య జరిగిన రెండో సర్వేలో 3.04 లక్షల మందిని సర్వే చేసి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని పేర్కొంది.

Related posts