telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మోడీ ని పొగిడాడు.. మూడు నెలలు సస్పెండ్ అయ్యాడు.. !

cpm leader suspension on praising modi

రాజకీయాలలోకి దిగిన తరువాత మంచితనం ఎక్కడ చూసినా దానిని ప్రోత్సహించడం అయ్యేపనికాదు. ఇక ప్రత్యర్థి పార్టీ వాళ్లలో మంచిని ప్రశంసించడం అసలు కుదరని పని. పొరపాటున అలాంటి పని చేస్తే, అంతే. తాజాగా ఇదే పరిస్థితిలో చిక్కుకున్నాడు ఈ రాజకీయ నాయకుడు. అతడు ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీని పొగిడాడు. ఆయనే సీపీఎం మహారాష్ట్ర కార్యదర్శి నర్సయ్య, దీనితో అతనిపై ఆ పార్టీ అధిష్ఠానం వేటేసింది. పార్టీ కేంద్ర కమిటీ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.

షోలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో నర్సయ్య మాట్లాడుతూ.. షోలాపూర్ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతి ఇవ్వడంపై ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన మంత్రిగా మోదీకి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పైనా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర కమిటీ.. క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నర్సయ్య వ్యాఖ్యలు పారీ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొంటూ మూడు నెలలు సస్పెండ్ చేసింది.

Related posts