telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు నోటీసులపై స్పందించిన సీపీఐ రామకృష్ణ

ap cpi leader ramakrishna on jagan as cm

టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ అగ్రనేతలు నారా లోకేశ్, వర్ల రామయ్యలకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. దళిత యువకుడి మరణంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారని అన్నారు. 

డీజీపీకి లేఖ రాశారన్న కారణంతో పోలీసులు ఆ విధంగా స్పందించారంటే ఇక భవిష్యత్తులో ఎవరూ లేఖలు రాయకుండా చేయడానికేనని ఆరోపించారు. చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందో, లేక జగన్ ఏకపక్ష రాజ్యం నడుస్తోందో అర్థంకాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని పరిపాలన సాగిస్తే సరిపోతుందని దుయ్యబట్టారు. లేకపోతే జగన్ ఇడుపులపాయలోనే ఉండి రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే ఆయనే పరిపాలన సాగిస్తారని దుయ్యబట్టారు.

Related posts