telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిస్థితుల ప్రభావంతో .. మద్దతు ఉపసంహరణ .. : సీపీఐ

cpi supporting trs in huzurnagar election

తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో సీపీఐ తమ టీఆరెస్ ఎన్నికల పొత్తును వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఒక పక్క హుజుర్ నగర్ ఉప ఎన్నిక, మరో పక్క సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. సీపీఐ మద్దతు ఎందుకు ఉపసంహరించుకుందోనన్న అంశంపై టిఆర్ఎస్ ఆలోచించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రోజుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అనే అంశంపై మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామన్న ఆ పార్టీ పొత్తును తెగతెంపులు చేసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైంది. హుజూర్ నగర్ లో మంగళవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుమని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై చర్చిస్తామన్నారు.

కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకుపోతున్నట్టు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కార్మికుల ఆత్మహత్యలకు కారణమౌతున్న అధికార టిఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇవ్వలేమని సీపీఐ తెలిపింది. రోజు కొక ఆత్మ హత్య జరుగుతున్నా నేరుగా రంగం లోకి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగం ఏమిటని నిలదీశారు. మరోవైపు టిఆర్‌ఎస్‌నేత కె కేశవరావు కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో కేశవరావు సమావేశమయ్యే అవకాశం ఉందని గులాబీ దళం పేర్కొంటుంది. దీనితో ఆర్టీసీ సమ్మె ఒక కొల్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Related posts