telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీలో కేంద్రానికి 31శాతం వాటా.. సీపీఐ నేత నారాయణ

Narayana cpi

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీలో కేంద్రానికి 31శాతం వాటా ఉందని.. ప్రైవేట్‌పరం చేస్తామంటే బీజేపీ ఊరుకుంటుందా? అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్‌ మెడలు మోదీ, అమిత్‌షాలు వంచుతారని నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల చెంపపై కొడితే మోదీ, షాలు కేసీఆర్‌ చెంపపై కొడతారని సీపీఐ నేత నారాయణ అన్నారు.

ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే బస్సులు తమ శవాలపై నుంచి వెళ్లాలని, ఎంగిలి మెతుకులకు ఆశపడి మంత్రి పదవులు పొందిన కొందరు.. కార్మికులపై అవాకులు, చవాకులు పేలుతున్నారని నారాయణ విమర్శించారు. కేసీఆర్‌ తనకు తానే డెడ్‌లైన్‌ విధించుకున్నాడని నారాయణ ఎద్దేవా చేశారు.

Related posts