telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ లో  5లక్షల సీసీ కెమెరాలు: అంజనీకుమార్‌ 

హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో కలకలం సృష్టించిన వరుస చైన్‌ స్నాచింగ్‌ కు పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు.నేరస్థులను పట్టించడంలో  నగరంలో  సీసీ కెమెరాలే కీలకమయ్యాయని సీపీ  తెలిపారు. ఈ సంవత్సరం కూడా ప్రజల సహకారంతో నేరాలను తగ్గిస్తామని ఆయన తెలిపారు. నేరాలు చేస్తే సహించే ప్రస్తకే లేదని వెల్లడించారు.
నేరాలను గత ఏడాది 6 శాతం తగ్గించామని, నగరంలో 2.5 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని, ఈ ఏడాది చివరకు 5 లక్షల సీసీ కమెరాల ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.  సీరియల్ స్నాచర్లను పట్టుకోవడం కోసం ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీసులు కలిసి పనిచేశారని, దీంతో పాటు 2 వేల లాడ్జీలను కూడా తనిఖీ చేశామన్నారు. 

Related posts