telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాట్సప్ లో మెసేజ్ లు ఫార్వార్డ్ చేసే ముందు చెక్ చేసుకోవాలి

cp sajjanar on disa accused encounter

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్బంగా జీహెచ్ఎంసీ, ఎన్నికల కమిషన్ తో సమన్వయంగా పని చేస్తున్నామని..పోలీసులు చెకింగ్ లలో కోటీ రూపాలకు పైగా నగదు దొరికిందన్నారు. ఈ నగదును ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఐటీ డిపార్ట్‌మెంట్ కు అందజేస్తామని.. 1500 వెపన్స్ సరెండర్ చేశారని తెలిపారు. ఆర్మీకి చెందిన వ్యక్తులతో పాటు బ్యాంకు ఇతర రంగాలలో ఉన్న వారికి మినాహాయించామని.. ప్రతి ప్రింటింగ్ సెంటర్ లో ఆర్మ్‌డ్ సిబ్బంది బందోబస్తులో ఉంటారని పేర్కొన్నారు. ఈరోజు ఓయు క్యాంపస్ లో డీఆర్‌సి సెంటర్ ను చూశాక నాకు పూర్తి నమ్మకం వచ్చిందని… ప్రజలకు హైదరాబాద్ పోలీసులు నుండి విశ్వాసం కలిపించేందుకు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో 75 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. వారంతా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకునే చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కును కుటుంబంతో కలిసి వచ్చి వినియోగించుకోవాలని.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఎవరైనా సరే 50 వేల కంటె ఎక్కువ వెంట తీసుకెళ్ళ వద్దని పేర్కొన్నారు. ఒకవేళ తీసుకెళితే అవసరమైన డాక్యుమెంట్ దగ్గర ఉంచుకోవాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు పోస్ట్ చేసినా, తప్పుడు ప్రచారాలను పోస్ట్ చేసిన కేసులు పెడతామని హెచ్చరించారు.వాట్సప్ లలో మెసేజ్ లు ఫార్వార్డ్ చేసే ముందు చెక్ చేసుకోవాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నిటిని పాటిస్తున్నామని పేర్కొన్నారు.

Related posts