telugu navyamedia
culture news Telangana

వాహనచోదకులు రోడ్లపైకి వస్తే ఆధార్‌ ఉండాలి:  సీపీ సజ్జనార్

cp sajjanar on disa accused encounter

వాహనచోదకులు రోడ్లపైకి వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ అన్నారు. రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యటించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీపీ తనిఖీ చేశారు.

లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. ఎటువంటి కారణం లేకుండా, అనుమతి లేకుండా వాహనాలతో రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం రోడ్లపైకి వచ్చే వారిని 3 కిలో మీటర్ల లోపే అనుమతిస్తామని చెప్పారు. పోలీసులు నిర్వహించే తనిఖీలకు వాహనదారులు సహకరించాలని కోరారు.

Related posts

ఈసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీ కష్టమే…

Vasishta Reddy

బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

vimala p

ఆ మార్క్ అందుకున్న 4వ భారతీయుడిగా శిఖర్ ధావన్…

Vasishta Reddy