telugu navyamedia
culture news trending

మనిషి ముఖం కలిగిన దూడకు జన్మనిచ్చిన .. ఆవు ..

cow gave birth to human faced calf in

అర్జెంటీనాలోని విల్లా అనే గ్రామంలో వున్న ఓ ఆవు, మనిషి ముఖం కలిగిన దూడకు జన్మనిచ్చిందట. పుట్టిన ఈ ఆవుదూడ తన రూపంలో కాకుండా మనిషిలాగే ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. దురదృష్టకరమేంటంటే ఈ దూడ జన్మించిన కొద్ది సేపటికే కన్ను మూసిందట. ఇంకేముంది వింత రూపంలో పుట్టిన ఈ దూడను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారట. అందులో కొందరు ఈ సందర్భంగా వీడియో తీసి వైరల్ చేశారు.సాధారణంగా ఆవులకు పెద్ద ముక్కు,చెవులు,నోరు ఉంటాయి. దీనికి మాత్రం మనిషి తరహాలో చిన్నవిగా ఉన్నాయి. దాని పుర్రె కూడా మనిషి రూపంలోనే ఉంది.

దీనిపై జన్యుశాస్త్ర నిపుణుడు నికోలస్ మ్యాగ్నాగో మాట్లాడుతూ, జన్యు పరివర్తన వల్ల ఈ ఆవు దూడా ఆ రూపంలో పుట్టి ఉంటుందన్నారు.అంతే కాకుండా ఒక్కోసారి డీఎన్‌ఏల్లో మార్పు వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయని తెలిపారు.భౌతిక,రసాయన లేదా జీవ సంబంధ చర్యల వల్ల దూడ జన్యు శ్రేణిలో మార్పులు కలిగాయని,అందువల్లే దాని రూపంలో మార్పు వచ్చిందన్నారు.దాని వల్ల పుర్రె సరైన క్రమంలో ఎదగలేదని,దానివల్ల మనిషి రూపంలో కనిపిస్తోందని తెలిపారు.ఏది ఏమైన ఇది ప్రపంచంలో ఓ వింత విషయమేనని పేర్కొన్నారు.

Related posts

మార్కెట్ లో బంగారం ధరలు..

vimala p

రాహుల్ కు సుప్రీంకోర్టులో ఊరట..బ్రిటన్ పౌరసత్వం పిటిషన్ కొట్టివేత

vimala p

షూటింగ్ పూర్తి చేసుకున్న అక్కినేని స‌మంతనాగ‌చైత‌న్య‌ల ‘మ‌జిలీ’..

vimala p