telugu navyamedia
culture news political trending

గోమాత.. రాష్ట్ర మాతగా…

cow as state mother of himachalpradesh

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తాజాగా గోమాతను ఆ రాష్ట్ర మాతగా ప్రకటిస్తూ తీర్మానించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీనిని కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అసెంబ్లీ లో తీర్మానం ఆమోదం పొందిన అనంతరం అనిరుధ్ మాట్లాడుతూ, గోమాతకు కులాలు లేవని, మానవాళికి ఎంతో మేలు చేసే ఇటువంటి జీవులకు అనవసరమైనవి అంతగట్టవద్దని అన్నారు.

అయితే ఆవులు వట్టిపోయినప్పుడు వాటిని యజమానులు వదిలేయడంపై అనిరుధ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోసంరక్షణ దేశానికి ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయాలలో ఒకటని ఆయన గుర్తుచేశారు. ఈ పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆపాలని ఆయన పేర్కొన్నారు. గోమాత భారతీయులకు పూజనీయమైనదనే రాష్ట్రీయ మాతగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు.

Related posts

థియేటర్ల మాఫియాతో సమస్య… ఆ కుక్కలకు బుద్ధి చెప్పాల్సిందే : అశోక్ వల్లభనేని

vimala p

కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ

vimala p

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ45..

vimala p