telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గర్భిణులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా ?

కరోనా వ్యాక్సిన్‌ గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో గైనకాలజిస్ట్‌లు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు గర్భం దాల్చే ఆలోచన ఉన్న మహిళలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకునే వీలు లేనందున, గర్భధారణను కనీసం రెండు నెలల పాటు వాయిదా వేసుకోవాలని మహిళలను వారు కోరుతున్నారు. గతంలో రుబెల్లా వ్యాక్సిన్‌ రూపొందిన ప్రారంభంలో ఎదుర్కొన్న పరిణామాలను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బలహీనపరిచిన రూబెల్లా వైరస్‌తో రూపొందిన వ్యాక్సిన్‌ను గర్భిణులకు ఇచ్చినప్పుడు ఈ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు గర్భిణీ శరీరంలో తయారైనా, అదే సమయంలో వైరస్‌ ప్లాసెంటాను దాటుకుని, గర్భస్థ పిండానికి సోకిన దాఖలాలు ఉన్నాయి. ఫలితంగా కంటిచూపు, వినికిడి లోపాలు, మానసిక వైకల్యాలను పిల్లలు పుడుతూనే వెంట తెచ్చుకున్నారు. ఇలాంటి పొరపాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌లో కూడా జరగకుండా ఉండాలంటే, వ్యాక్సిన్‌ కోసం గర్భధారణను వాయిదా వేసుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు.

Related posts