telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బ్యాంకు కస్టమర్లకు షాక్… ఇక ఈరోజుల్లో కూడా బ్యాంకులు బంద్

Bank

ఇకపై ప్రతి వారం శనివారం రోజున బ్యాంకులు క్లోజ్‌లోనే ఉంటాయి. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నుంచి తరుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బ్యాంకులు శనివారం క్లోజ్‌లోనే ఉంటాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) రాష్ట్ర కార్యదర్శి సంజయ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 2,000కు పైగా బ్యాంక్ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇదే రూల్ అన్ని చోట్ల అమలులోకి రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఉత్వర్వులు కూడా జారీచేసింది. దీంతో బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. కరోనా వైరస్ బారిన పడుతున్న బ్యాంకు ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యాంకు బ్రాంచులు ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాల్లో పనిచేయవు. అలాగే ఆదివారం బ్యాంక్ ఉద్యోగులకు ఎలాగో సెలవు ఉంటుంది.

Related posts