telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వచ్చే నెల నుండి వారికీ కూడా వ్యాక్సిన్…

Corona Virus Vaccine

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ ఏడాది మొదట నుండి వ్యాక్సిన్ అందిస్తుంది ప్రభుత్వం. అయితే దశల వారీగా ఈ వ్యాక్సినేషన్ ను నిర్వహిస్తుంది ప్రభుత్వం. అయితే తాజాగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ -19 కు టీకాలు వేయడానికి అర్హులేనని  అని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది, కరోనా వ్యాక్సిన్ సరళీకృత మరియు వేగవంతమైన దశ 3 గా దీనిని చెబుతున్నారు. ముందు మెడికల్, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. తరువాత 45 ఏళ్ళ వారికి ఇచ్చారు. అయితే కరోన కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో  18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయిన్చేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. దీంతో వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తిని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం ప్రోత్సహించనుంది

Related posts