telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్‌ కారణంగా పతనమైన పసిడి ధర…

gold

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరొనతో సతమతమవుతుంది. ఈ వైరస్‌ కొంత కాలం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.. ఇప్పుడు.. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ కూడా పసిడి ధర పతనానికి కారణమైంది… అదేలా? అనే ప్రశ్న వెంటనే రావొచ్చు..! విషయం ఏంటంటే.. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ఫలితాల్లో పురోగతి సాధించినట్టు ఫైజర్‌ ప్రకటించింది.. ఫేజ్3 కోవిడ్-19 టీకా ట్రయల్ ఫలితాలు మొదటి సమీక్షలో పురోగతి సాధించిందని ఆ సంస్థ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా వెల్లడించారు. అయితే, ఈ ప్రకటన వచ్చిన కొన్ని క్షణాల్లోనే పసిడి ధర పతనం ప్రారంభమైంది.. 10 గ్రాముల బంగారం ధర రూ.1000 వరకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 2 శాతం క్షీణించి రూ. 51,165కు చేరుకోగా.. వెండి ఫ్యూచర్స్ రూ.2,205 పతనం కావడంతో.. కిలో వెండి ధర రూ.63,130కు పడిపోయింది. ఇక, గ్లోబల్ మార్కెట్‌లో 2 శాతం క్షీణించి ఔన్స్‌ బంగారం ధర 1909.99 డాలర్లకు చేరుకుంది.

Related posts