telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ స్కూళ్లలో కరోనా విలయం…ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు

collector sudden visit to schools in

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూత పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు లేకుండానే అందరినీ పాస్‌ చేసాయి ప్రభుత్వాలు. అయితే.. కరోనా నేపథ్యంలోనూ ఏపీలో పాఠశాలలు ప్రారంభించింది జగన్‌ సర్కార్‌. పాఠశాలలు ప్రారంభమై నిన్నటితో రెండో రోజు కూడా అయింది. అయితే..స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. రెండో రోజున ఏపీలో 99.92 శాతం మేర తెరుచుకున్నాయి స్కూళ్లు. మొత్తంగా 33.69 శాతం మేర విద్యార్థుల హాజరు అయ్యారు. 90.92 శాతం మేర విధులకు హాజరయ్యారు టీచర్లు. కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ వంద శాతం మేర తెరుచుకున్నాయి పాఠశాలలు. కృష్ణా జిల్లాలో 99 శాతం మేర తెరుచుకున్నాయి పాఠశాలలు. 25.19 శాతం మేర తొమ్మిదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 42.33 శాతం మేర పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. అయితే.. నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు, ఓ టీచరుకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో ఓ టీచరుకు సోకిన కరోనా సోకింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts