telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చికెన్ తింటే కరోనా వస్తుందా ?… నిరూపిస్తే రూ. కోటి బహుమతి

chicken ban karona

భారతదేశమంతా ఈ మహమ్మారి వైరస్‌తో గజగజలాడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులు కోకొల్లలుగా వ్యాపిస్తుండటంతో ప్రజలు కోడి మాంసాన్ని పట్టుకోవడానికే భయపడుతున్నారు. దీనితో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది నిరూపిస్తే రూ.కోటి రూపాయలు బహుమతి అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా వెల్లడించాయి. కాగా కరోనా దెబ్బకు గుడ్లు, చికెన్ సేల్స్ పడిపోయాయి. పౌల్ట్రీకి ప్రసిద్ధి గాంచిన నామక్కల్‌లో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారంలు తీవ్రంగా నష్టపోయాయి. దీనితో కోడి గుడ్డు ధర రూ. 1.3 పడిపోగా, కోడి మాంసం రూ. 20కి తగ్గింది. ఇది కూడా కేవలం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల వల్లే జరిగిందని అక్కడి రైతులు వాపోతున్నారు.

Related posts