telugu navyamedia
క్రైమ్ వార్తలు

లగ్జరీ కారులో రోడ్లపై షికారు చేసి గుంజీలు తీసిన యువకుడు

లాక్‌డౌన్‌ సమయంలో పసుపు రంగు పోర్షే 718 బాక్స్టర్ కారులో రోడ్లపై షికారు చేస్తున్న ఓ యువకుడి చేత సెక్యూరిటీ సిబ్బంది గుంజీలు తీయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ యువకుడితో గుంజీలు తీయించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు కాదు. నగర సురక్షా సమితికి చెందిన సెక్యూరిటీ గార్డులు. ఆ యువకుడు మాస్కు పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్నాడనే కారణంతోనే తాము గుంజీలు తీయించామని సెక్యూరిటీ గార్డులు వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీస్, ఆర్మీ, ఇతర భద్రతా బలగాల్లో పనిచేసిన వారితో సెక్యూరిటీ కౌన్సిళ్లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ బాధ్యతలు అప్పగించింది. అతడితో గుంజీలు తీయించిన సెక్యూరిటీ గార్డులు కూడా ఆ కౌన్సిల్‌లో సభ్యులే అని తెలిసింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన ఆ యువకుడు.. పేదలకు ఆహారం పంచేందుకు తిరుగుతున్నానని, ఇందుకు పాస్ కూడా ఉందని తెలిపాడు. మాస్క్ లేదనే కారణంతో వారు గుంజీలు తీయించారని పేర్కొన్నాడు.

Related posts