• Home
  • వార్తలు
  • గోకుల్‌చాట్, లుంబినీపార్కు పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
క్రైమ్ వార్తలు వార్తలు

గోకుల్‌చాట్, లుంబినీపార్కు పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి

Court Verdict on Hyderabad Twin Blasts Case

హైదరాబాద్ లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్కుల్లో పేలుళ్లు జరిగిన 11ఏళ్ల తర్వాత కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. మొత్తం అయిదుగురు నిందితుల్లో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. అక్బర్ ఇస్మాయిల్, అనిక్ షరీక్ సయిద్‌‌లను దోషులుగా నిర్ధారించింది. వీరికి వచ్చే సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది.

దోషుల్లో ఏ1 అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి‌, ఏ2 షఫిక్‌ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. ఏ5, ఏ6లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్ధోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్‌ రజాఖాన్, రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు.

2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కులో ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. గోకుల్‌చాట్‌ వద్ద 32మంది మరణించగా.. 47 మందికి గాయాలయ్యాయి. లుంబినీపార్క్‌లో 12 మంది మరణించగా, 21 మంది క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో ఈరోజు తీర్పును వెల్లడించిన కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్థారించింది.

Related posts

రోడ్డు ప్రమాదాలపై సుప్రీం సంచలన తీర్పు… ఇకపై ప్రమాద భీమా పొందాలంటే ఈ నిబంధనలు

nagaraj chanti

వైసీపీ ఎంపీల "రాజీ"నామా

admin

ఏపీ, కర్నాటక లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలపై ఈసీ వివరణ

madhu

Leave a Comment